: ఈ సారి టార్గెట్ ఐరాస!... జకార్తాలో బాంబు పేలుళ్లు
విశ్వవ్యాప్తంగా ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ‘ఉగ్ర’ దాడులు ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం పురుడుపోసుకున్న ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా ఉగ్రవాదులు పంజా విసిరారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో కొద్దిసేపటి క్రితం బాంబులు పేలాయి. సెంట్రల్ జకార్తాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం సమీపంలో శక్తిమంతమైన బాంబు పేలుళ్లు సంభవించాయి. దీంతో అక్కడ కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.