: సమాధాన పత్రాల్లో కూడా ఎస్ఎంఎస్ భాషనే రాసేస్తున్న విద్యార్థులు!
I knw, gr8, thnx, lyk, nit, al, dey, oki, der, ere, wer u మొదలైన ఎస్ఎంఎస్ పొట్టి భాష పదాలు ఇప్పుడు విద్యార్థుల సమాధాన పత్రాల్లో విరివిగా కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా మొబైల్ ఫోన్ల వినియోగం మరింతగా పెరిగిన నేపధ్యంలో విద్యార్థులు తమ తోటి స్నేహితులకు పంపే ఎస్ఎంఎస్ భాషనే సమాధాన పత్రాల్లోనూ రాస్తున్నారట. అయితే పలువురు ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఈ భాష అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ఢిల్లీకి చెందిన ఒక పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు తమ స్నేహితులకు ఫోన్ లలో ఎస్ఎంఎస్ లు పంపేటప్పుడు ఒక విచిత్రమైన భాషను వాడుతుంటారు. అది అక్కడవరకూ పరిమితమైతే పరవాలేదు. కానీ కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో సైతం ఇదే విధమైన భాషను వాడేస్తున్నారు. ఇది మంచి విధానం కాదని విద్యార్థులను మందలిస్తున్నామని ఆయన తెలిపారు.