: కేబీఆర్ పార్క్ వద్ద బోగి మంటలు వేసిన కల్వకుంట్ల కవిత... భారీగా హాజరైన మహిళలు


తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు హోరెత్తుతున్నాయి. నిన్న ఏపీలోని పలు ప్రాంతాల్లో సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వయంగా సంబరాల్లో పాల్గొన్నారు. తాజాగా గురువారం బోగి వేడుకలకు నిజామాబాదు ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శ్రీకారం చుట్టారు. బోగిని పురస్కరించుకుని నేటి తెల్లవారుజాముననే ఆమె హైదరాబాదులోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ వద్ద బోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు కవితకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని పల్లెసీమలే కాక హైదరాబాదు తరహా నగరాల్లోనూ వాడవాడలా బోగి మంటలు వెలిశాయి.

  • Loading...

More Telugu News