: నెల్లూరు జిల్లాలో స్వల్ప భూకంపం... 3 సెకన్ల పాటు కంపించిన భూమి


నెల్లూరు జిల్లాలో కొద్దిసేపటి కిందట స్వల్ప భూకంపం సంభవించింది. వరికుంటపాడు, జడదేవి, కడియంపాడు, నర్రవాడ, లక్ష్మీపురం, దాసరిపురం, తూర్పు తెన్నెంపల్లె, తూర్పుబోయమడుగు గ్రామాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. జిల్లాలో భూప్రకంపనలు సంభవించడం ఇది రెండోసారి. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

  • Loading...

More Telugu News