: కేరళ జాలర్ల హత్య కేసులో నిందితుడిని భారత్ కు పంపం: ఇటలీ


ఇద్దరు కేరళ జాలర్ల హత్య కేసులో ఓ నిందితుడైన ఇటలీ నేవీ అధికారిని భారత్ కు తిప్పి పంపే విషయంలో ఆ దేశం మాటమార్చింది. అధికారిని తిరిగి భారత్ కు పంపమని స్పష్టం చేసింది. అంతేగాక ఢిల్లీలోని ఇటలీ ఎంబసీలో ఉన్న రెండో మెరైనర్ అధికారిని కూడా వెనక్కి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తామని ఇటలీ ప్రకటించింది. 2012లో ఓ ఇటాలియన్ నౌక కేరళ వద్ద భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించింది. ఆ నౌకలో ఉన్న ఇటాలియన్ మెరైన్ లు ఇద్దరు కేరళ జాలర్లను దొంగలన్న అనుమానంతో కాల్చి చంపారు. దాంతో వారిని భారత ప్రభుత్వం అరెస్టు చేసి విచారణ జరిపింది. అందులో ఓ అధికారికి తీవ్ర అనారోగ్యం కారణంగా 2014లో ఇటలీ వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఇప్పుడు అతన్నే వెనక్కి పంపమని ఇటలీ చెబుతోంది. ఈ ప్రకటనతో కేరళ సీఎం ఉమెన్ చాందీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News