: సెటిలర్లు హైదరాబాదులో ప్రశాంతంగా ఉండాలని లేదా? : బాల్క సుమన్
ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాదులో ఉంటున్న ప్రజలు ప్రశాంతంగా ఉండడం టీడీపీకి ఇష్టం లేదా? అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో గొడవలు జరిగేలా టీడీపీ నేత నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ సవాలును టీడీపీ, బీజేపీలు ఎందుకు స్వీకరించడం లేదని ఆయన అడిగారు. కాంగ్రెస్ పార్టీ తరపున దిగ్విజయ్ సింగ్ ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆ పార్టీ ఓడిపోతుందని, ఆయన పేరును అపజయ్ సింగ్ గా మార్చాలని సుమన్ సూచించారు.