: ఏలూరులో కోడిపందేలు ప్రారంభించిన ఎంపీ మాగంటి బాబు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎంపీ మాగంటి బాబు కోడి పందేలు ప్రారంభించారు. అటు తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలోను, కృష్ణా జిల్లాలోని పెనమలూరు, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లోను కూడా కోడిపందేలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ కోడి పందేలకు హైకోర్టు అనుమతి నిరాకరించినా, స్వయంగా ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా ఎంపీ మాగంటి వీటిని ప్రారంభించడం వివాదాస్పదంగా మారింది. చట్టాలపై తమకు గౌరవం ఉందని, పండుగ సంప్రదాయం కాబట్టే ఆడుతున్నామని మాగంటి అంటున్నారు.