: ప్రముఖ కమెడియన్ కికూ శ్రద్ధ అరెస్టు!


ప్రముఖ టీవీ కమెడియన్ కికూ శ్రద్ధను ముంబయి పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, తనకు తాను దేవుడినని ప్రకటించుకున్న బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ ను ఒక కామెడీ షోలో శ్రద్ధ అనుకరించారనే ఆరోపణలపై అరెస్టు చేయడం జరిగింది. హర్యానాలోని స్థానిక కోర్టులో ఆయన్ని హాజరుపర్చారు. గత డిసెంబర్ 27వ తేదీన ప్రసారమైన ఒక ఎపిసోడ్ లో బాబా గుర్మీత్ ను శ్రద్ధ అనుకరించారని.. అవి తమ మనోభావాలను దెబ్బతీశాయని గుర్మీత్ భక్తులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, టీవీలో ప్రసారమయ్యే బ్లాక్ బ్లస్టర్ హిట్ షో ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ లో కపిల్ శర్మతో కలిసి కికూ శ్రద్ధ నటిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News