: టీమిండియా అండర్-19 కెప్టెన్ ను చితక్కొట్టిన పాట్నా వాసులు... ఆ తర్వాత అరెస్ట్!
మరో 10 రోజుల్లో అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ బంగ్లాదేశ్ లో ప్రారంభం కానుంది. ఈ నెల 22 నుంచి మొదలుకానున్న సదరు టోర్నీలో భారత జట్టుకు పాట్నా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే నిన్న కిషన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న తన తండ్రి కారుతో పాట్నా రోడ్లపైకి దూసుకువచ్చిన కిషన్... ర్యాష్ డ్రైవింగ్ తో తన ముందు వెళుతున్న ఆటో రిక్షాను ఢీకొట్టాడు. వేగంగా దూసుకువచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో అందులోని ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు కిషన్ ను చితక్కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. వికెట్ కీపర్ గానే కాక బ్యాట్స్ మన్ గానూ రాణిస్తున్న కిషన్ ఇటీవలే బీసీసీఐ అండర్-19 జట్టుకు కెప్టెన్ గా ఎంపిక చేసింది.