: స్విట్జర్లాండ్ పర్యనటకు చంద్రబాబు.... ఈ నెల 19 నుంచి 24 వరకు స్విస్ టూర్
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్విట్జర్లాండ్ పర్యటన ఖరారైంది. సంక్రాంతి సంబరాలు ముగిసిన తర్వాత ఈ నెల 19న స్విట్జర్లాండ్ బయలుదేరనున్న చంద్రబాబు 24 వరకు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు అక్కడి ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో వరుస భేటీలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు చంద్రబాబు స్విట్జర్లాండ్ పర్యటనను ఖరారు చేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.