: కానిస్టేబుల్ కావాలన్న కల తీర్చుకునేందుకు... మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం వదిలేశాడు!


నిజమే... పోలీస్ కానిస్టేబుల్ కావాలన్న చిరకాల వాంఛను తీర్చుకునేందుకు ఆ వ్యక్తి బంగారం లాంటి ఉద్యోగాన్ని వదిలేశాడు. అతడి సాహస నిర్ణయాన్ని జాతీయ మీడియా వేనోళ్ల పొగడుతోంది. అతడే రూపేశ్ కృష్ణారావు పవార్. ముంబై విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసే నాటికే అతడికి ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఆకర్షణీయ వేతనంతో కూడిన ఉద్యోగం రెడీగా ఉంది. ఇంకేమీ ఆలోచించకుండానే ఆ ఉద్యోగంలో చేరిపోయాడు. అయితే పోలీస్ కానిస్టేబుల్ కావాలన్న అతడి కోరిక మాత్రం చావలేదు. నిన్నటిదాకా చేసిన మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగంతో ప్రస్తుతానికైతే పెద్ద వేతనమేమీ లేకున్నా... భార్య, ఇద్దరు పిల్లలను ఇబ్బంది లేకుండా పోషించుకుంటున్నాడు. అయితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశముంది. ఇవేవీ పట్టించుకోని రూపేశ్ ను...కానిస్టేబుల్ కావాలన్న కోరిక సంచలన నిర్ణయం తీసుకునేలా ఉసిగొల్పింది. కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించేందుకు ధైర్యం కావాలి అంటూ చెబుతున్న మాటలు పలువురిని ఆలోచనలో పడేస్తున్నాయి.

  • Loading...

More Telugu News