: పాక్ పై ఉగ్రదాడి... క్వెట్టాలో పేలిన బాంబులు, పలువురి దుర్మరణం


కొద్ది సేపటి క్రితం పాకిస్థాన్ ప్రధాన పట్టణాల్లో ఒకటైన క్వెట్టాపై ఉగ్రవాదుల దాడి జరిగింది. జనసమ్మర్ధమున్న ప్రాంతంలో శక్తిమంతమైన బాంబులను ఉగ్రవాదులు పేల్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ దాడిలో 10 మంది వరకూ చనిపోగా, సుమారు 20 మంది వరకూ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు చేర్చినట్టు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారి ఒకరు వెల్లడించారు. ఈ దాడి వెనుక ఎవరున్నారన్న సమాచారం, మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News