: ‘నాన్నకు ప్రేమతో’ థియేటర్లపై రాళ్ల దాడి!... బ్లాక్ లో టికెట్ల అమ్మకమే కారణమట


టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే వార్తలకు ఎక్కింది. విజయవాడలో ఈ చిత్ర ప్రదర్శనకు ఎంపికైన రాజ్, యువరాజ్ థియేటర్లపై కొద్దిసేపటి క్రితం రాళ్ల దాడి జరిగింది. సినిమా టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్నారన్న వార్తలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహోదగ్రులయ్యారు. థియేటర్లపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో థియేటర్ల అద్దాలు పగిలిపోయినట్లు సమాచారం. థియేటర్లపై దాడి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి చేయి దాటిపోకుండా చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News