: కేటీఆర్... నీకు తెలంగాణలో చప్రాసీ ఉద్యోగమైనా వస్తుందా?: రేవంత్ రెడ్డి


కేటీఆర్ సర్కస్ లో జోకర్ గా ఫీలవుతున్నట్టు కనిపిస్తోందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని నిజాం కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ భవన్ కు తెలుగు భవన్ అని పేరుపెడతానని కేటీఆర్ అంటే, 'బోర్డును ఎన్డీయే తరపున ఇస్తాం మార్చు' అని సవాలు విసిరితే జోక్ చేశానని అంటున్నాడని మండిపడ్డారు. నాకు మంత్రి పదవే ఎక్కువ, ముఖ్యమంత్రి ఆలోచనే లేదని కేటీఆర్ అంటున్నారు...అది నిజమేనని ఆయన చెప్పారు. ఎందుకంటే కేటీఆర్ చదివింది గుంటూరు, పూణే, అమెరికాల్లో. మరి భారతీయ చట్టాల ప్రకారం ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా ప్రాథమికోన్నత విద్య ఎక్కడ పూర్తి చేస్తే అదే వారి నేటివిటీ అవుతుందని, అలాంటప్పుడు తెలంగాణలో పదవులకు కేటీఆర్ ఎలా అర్హుడవుతాడని ఆయన నిలదీశారు. న్యాయంగా అయితే కేటీఆర్ తెలంగాణలో చప్రాసీ పనికి కూడా అర్హుడు కాడని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News