: మంచి స్కోరే... కానీ మరింత బాగా ఆడాల్సింది: ధోనీ


జట్టు మరింత మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో ఓటమిపాలైన అనంతరం ధోనీ మాట్లాడుతూ, టీమిండియా బ్యాట్స్ మన్ బాగా ఆడారని అన్నాడు. స్కోరు బోర్డుపై ఉంచిన స్కోరు మంచిదేనని అభిప్రాయపడ్డాడు. అయితే మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిందని ధోనీ పేర్కొన్నాడు. పిచ్ ఆటగాళ్లకు సహకరించిందని, బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాల్సిందని, ఆసీస్ బ్యాట్స్ మన్ రాణించారని ధోనీ తెలిపాడు. రెండో వన్డేపై దృష్టిపెడతామని దోనీ చెప్పాడు. తొలి వన్డేలో రోహిత్, కోహ్లీ రాణించడం శుభపరిణామమని ధోనీ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News