: ఆర్డినెన్స్ ద్వారా జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వండి: జయలలిత


జల్లికట్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో తమిళనాడు సీఎం జయలలిత కేంద్రానికి లేఖ రాశారు. ఆర్డినెన్స్ ద్వారా జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. జల్లికట్టును సాంస్కృతిక, సంప్రదాయ క్రీడగా భావించాలని, తమిళుల మనోభావాలతో ముడిపడిన అంశంగా పరిగణించాలని లేఖలో పేర్కొన్నారు. జల్లికట్టుపై కేంద్రం అనుమతులను నిలిపివేయాలని కోరుతూ వన్యప్రాణి సంరక్షణ బోర్డు, పెటా సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇవాళ సుప్రీంకోర్టు దీని నిర్వహణపై స్టే విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News