: సీఎం కేసీఆర్ ను కలసిన శరద్ పవార్


తెలంగాణ సీఎం కేసీఆర్ ను హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కలిశారు. ఈ సందర్భంగా పవార్ కు కేసీఆర్ ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రభుత్వ జ్ఞాపికను అందజేశారు. సీఎంను పవార్ కలసిన సమయంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు కేశవరావు, కవిత కూడా ఉన్నారు. అయితే ఏ విషయాలపై వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగిందనేది తెలియాల్సి ఉంది. డిసెంబర్ లో కేసీఆర్ నిర్వహించిన చండీయాగానికి పవార్ హాజరైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News