: ట్యుటికోరన్ బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలాలు
తమిళనాడులోని ట్యుటికోరన్ సముద్ర తీరానికి గత రాత్రి పెద్ద సంఖ్యలో తిమింగలాలు కొట్టుకువచ్చాయి. ఇవి దాదాపు 100 తిమింగలాలు ఉంటాయని అధికారులు తెలిపారు. వాటిని గమనించిన మత్స్యకారులు, అధికారులు ముందు ఆశ్చర్యపోయినా తిరిగి నీటిలోకి నెట్టేందుకు ప్రయత్నించినా మళ్లీ అవి ఒడ్డుకే వచ్చాయని అధికారులు చెప్పారు. అవన్నీ చాలా చిన్న తిమింగలాలని, ఇంత ఎక్కువ సంఖ్యలో బీచ్ కి కొట్టుకు రావటం ఇదే తొలిసారని జిల్లా సీనియర్ అధికారి రవికుమార్ వివరించారు. దానిపై దర్యాప్తు చేపట్టాలని మనార్ మెరైన్ పార్క్, ఫారెస్ట్ అధికారులకు చెబుతామన్నారు. గతేడాది ఆగస్టులో 33 అడుగుల తిమింగలం ఒకటి నాగపట్టణం జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.