: నేడు, రేపు ఏపీలో చంద్రన్న సంక్రాంతి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు చంద్రన్న సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ సంబరాల్లో భాగంగా గ్రామీణ ఆటలు, క్రీడల పోటీలు, కళారూపాల ప్రదర్శన ఉంటుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాల కోసం జిల్లాకు రూ.కోటి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి జిల్లాలో ప్రభుత్వం తరపున ఈ సంబరాలను నిర్వహిస్తారు.