: స్వాతంత్ర్యం వచ్చే నాటికే హైదరాబాద్ అభివృద్ధి చెందింది: కేటీఆర్


టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరం దేశానికే మణిహారమని, దేశానికి రెండో రాజధానిగా ఉండాలని అంబేద్కర్ చెప్పారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చేనాటికే ఈ నగరం అభివృద్ధి చెందిందన్నారు. విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఇక్కడ ఉందని, అందుకే హైదరాబాద్ ఒక మినీ ఇండియాగా కనిపిస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నగరంలో 30కి పైగా రక్షణరంగ సంస్థలున్నాయని, స్వాతంత్ర్యం వచ్చేనాటికే హైదరాబాద్ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని అన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రధాన ఆర్థిక వనరుగా ఉందని స్పష్టం చేశారు. ఐదు జిల్లాలకు ఈ మహానగరం విస్తరించిందని, తెలంగాణలో మూడోవంతు జనాభా ఇక్కడే ఉందని చెప్పుకొచ్చారు. గత పాలకులు నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయలేదని, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కనీస వసతులు కల్పించలేదని కేటీఆర్ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో మీడియా క్రియాశీలకంగా పని చేస్తోందన్నారు.

  • Loading...

More Telugu News