: కాదన్న ప్రియుడిపై ప్రియురాలి ఆమ్ల దాడి


తనను ప్రేమించి, ఆపై వంచించి మరో యువతిని వివాహమాడిన యువకుడిపై యాసిడ్ దాడి చేసిందో యువతి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బిజ్నోర్ సమీపంలోని ఇనాంపూర్ గ్రామంలో అఫ్రీన్, సూరజ్ లు ప్రేమ జంట. వీరిద్దరి ప్రేమ విషయం పెద్దలకూ తెలుసు. ఇటీవల సూరజ్ కు మరో యువతితో వివాహాన్ని పెద్దలు నిశ్చయించడం, అందుకు అతను అంగీకరించడంతో అఫ్రీన్ మనస్తాపానికి గురైంది. తనను కాదన్నాడన్న అక్కసుతో, ఆగ్రహంతో అతని ముఖంపై యాసిడ్ పోసింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన సూరజ్ ను ఆసుపత్రికి తరలించారు. అతని శరీరంపై 50 శాతం గాయాలయ్యాయని, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News