: ముసలి అత్తపై యూపీ కోడలు ప్రతాపం... సోషల్ మీడియాలో వీడియో వైరల్


అత్తలు పెట్టే ఆరళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కోడళ్ల గురించి మనకు తెలుసు. అత్తమామలను పెను భారంగా పరిగణించే కోడళ్లు ముదిమి వయసులోని వారిని బయటకు గెంటేస్తున్న ఘటనలూ మనకు చిరపరిచితమే. అయితే ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ కు చెందిన సంగీతా దేవీ అనే ఓ కోడలు వృద్ధాప్యంలోని తన అత్తపై వీర ప్రతాపం చూపింది. మంచంపై నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్న తన అత్తను హతమార్చేందుకూ యత్నించింది. వాటర్ హీటర్, రాడ్డు, రాయి.. చేతికి ఏది అందితే, దానితో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డా, ప్రాణాలతో బయటపడిన తన తల్లిని సంగీతా దేవీ భర్త ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నాడు. తన తల్లితో భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆ కొడుకు తల్లి గదిలో సీసీకెమెరా ఏర్పాటు చేశాడు. దీనిని గమనించని సంగీత తన అత్తపై ఈ నెల 5న వీరవిహారం చేసింది. తల్లిని ఆసుపత్రికి తరలించిన కొడుకు సీసీకెమెరాలో రికార్డైన తన భార్య ప్రతాపం దృశ్యాల వీడియోను సోషల్ మీడియాలో పెట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. వీడియోను చూసిన పోలీసులు సంగీతాదేవిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News