: డాక్టర్ అవుతానంటున్న అఫ్జల్ గురు తనయుడు!


అఫ్జల్ గురును భారతదేశం ఉరి తీసినందుకే తాము ఈ దాడులకు పాల్పడ్డామని, పఠాన్ కోట్ లో దాడులకు తెగబడిన ముష్కరులు చెబుతుంటే... మరో వైపు టెన్త్ పరీక్షల్లో ప్రతిభ చాటిన అఫ్జల్ గురు కొడుకు తాను డాక్టర్ అవుతానంటున్నాడు. తాను ఎటువంటి ప్రతీకార చర్యల్లోను పాల్గొననని, బాగా చదువుకుని తన తల్లిని చూసుకుంటూ, చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తూ డాక్టర్ ను కావాలనుకుంటున్నానని అఫ్జల్ గురు కొడుకు గాలిబ్ అబ్దుల్ అన్నాడు. తన తండ్రికి ఎదురైన ఘటనను తరచూ తలచుకోనని, అనునిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతుంటానని అన్నాడు. పైగా అన్నీ భగవంతుని చేతిలోనే ఉంటాయని వేదాంతం కూడా పలుకుతున్నాడు.

  • Loading...

More Telugu News