: నకిలీ పోలీస్ వెబ్ సైట్ తో జాగ్రత్త!


ప్రముఖ సినీనటులు, ఇతర ప్రముఖులు, పలు లాటరీ సంస్థల పేర్లతో నకిలీ వెబ్ సైట్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా, నకిలీ పోలీస్ వెబ్ సైట్ ను గుర్తు తెలియని వ్యక్తులు నడిపిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, పోలీసు ఉద్యోగాలకు www.tslprb.in అనే వెబ్ సైట్ లోనే దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు. తప్పుడు వెబ్ సైట్లతో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు తొలిరోజు 2,818 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News