: అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లిన బస్సు... ఫుట్ బాల్ క్రీడాకారులు దుర్మరణం!
మెక్సికోలో ఒక బస్సు అదుపుతప్పి అటోయాక్ నదిలో పడిన విషాద సంఘటన ఈరోజు జరిగింది. ఈ దుర్ఘటనలో ఫుట్ బాల్ క్రీడాకారులు 16 మంది దుర్మరణం చెందగా, మరో పది మంది క్రీడాకారులు గాయపడ్డారు. ఒక బ్రిడ్జిపై బస్సు వెళుతుండగా ఈ దారుణం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతులలో చిన్నారులు కూడా ఉన్నారని, మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశామని వారు తెలిపారు.