: రెండు నెలల గరిష్ఠానికి పసిడి ధర
ఈ ఏడాది బంగారం ధర అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే 26వేలు దాటిన దాని ధర ఇవాళ రెండు నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఈరోజు రూ.120 పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.26,450కి చేరింది. అటు వెండి ధర కూడా రూ.55 పెరగడంతో కేజీ ధర రూ.33,855కు చేరింది. దేశీయ మార్కెట్లో నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర పెరగగా... అటు పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టడంతో వెండి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.