: బర్త్ డే వేడుకకు హృతిక్ తనను ఆహ్వానించలేదంటున్న మాజీ భార్య


బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన 42వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించుకున్నాడు. పుట్టిన రోజును పురస్కరించుకుని బాలీవుడ్ సెలబ్రిటీలకు విందు ఇచ్చాడు. ఈ విందులో సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, పారిశ్రామిక వేత్తలతో పాటు హృతిక్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే అతని మాజీ భార్య సుసాన్నే ఖాన్ మాత్రం కనపడలేదు. దీనిపై మీడియా ఆమెను ప్రశ్నించగా, పుట్టిన రోజు వేడుకకు హృతిక్ తనను ఆహ్వానించలేదని తెలిపారు. విడిపోయిన నాటి నుంచి ఒకరి పుట్టినరోజు వేడుకలకు మరొకరిని పిలుచుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News