: అమెరికా వెళ్లే విద్యార్థుల కోసం నోడల్ అధికారిని నియమించాం: మంత్రి పల్లె
విదేశీ విద్య కోసం ఇటీవల అమెరికా వెళుతున్న అనేక మంది విద్యార్థులను వెనక్కి పంపిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. ఇక ముందు అమెరికా వెళ్లే విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై నోడల్ అధికారిని నియమించామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి విశాఖలో తెలిపారు. నోడల్ అధికారిగా సుధారాణిని నియమించామన్నారు. పలు కారణాల వల్ల భారత్ విద్యార్థులను అమెరికా అధికారులు వెనక్కి పంపుతున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కావాల్సిన అన్ని వివరాలతో వెబ్ సైట్ ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఎన్ఆర్ఐ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. వివరాలను ఎన్ఆర్ఐ వెబ్ సైట్ లో పెడతామన్నారు.