: ఆసీస్ టూర్ లో టీమిండియా వ్యూహంపై ధోనీ నమ్మకం


టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న ఆసీస్ తో వరల్డ్ నెంబర్ టూ టీమిండియా తలపడడం క్రీడాభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న ఈ సిరీస్ లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతామని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ఈ వ్యూహం సత్ఫలితాలనిస్తుందని కెప్టెన్ కూల్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ పై టీమిండియాకు మంచి ట్రాక్ ఉందని, దానిని నిలబెడతామని ధోనీ ఆటగాళ్లపై విశ్వాసం వ్యక్తం చేశాడు. షమి గాయపడడంతో ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ తో బరిందర్ స్రాహకు అవకాశం దక్కనుంది. స్పిన్నర్లుగా ఆల్ రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల స్థానం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ లో ధావన్, రోహిత్, కోహ్లీ, రహానే, ధోనీలు సత్తా చాటితే టీమిండియా సిరీస్ లో రాణించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News