: కలలో కూడా సీఎం కావాలని కోరుకోలేదు: కేటీఆర్


కలలో కూడా సీఎం కావాలని తాను కోరుకోలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తనకు మంత్రి పదవే చాలా ఎక్కువని, ప్రజలు ఇచ్చిన అవకాశంతోనే మంత్రి పదవి వచ్చిందని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సొంత నిర్ణయాలు తీసుకుంటూ కేటీఆర్ ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శల నేపథ్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయనిలా స్పందించారు. ఇదే సందర్భంగా బీజేపీ పార్టీపై వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జోక్ పార్టీ అని, రామమందిరం కడతామని రాముడికే ఆ పార్టీ శఠగోపం పెట్టిందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదన్నారు. ఆయన అన్ని రాష్ట్రాలకు ప్రధానని, ఇంతవరకు తెలంగాణకు రాకపోవడం శోచనీయమని చెప్పారు. అందుకే బీజేపీ నేతలను నిధులు తీసుకురమ్మని ప్రజల కోసం అడుగుతున్నామని, ఇందులో ఎలాంటి తప్పులేదనుకుంటున్నానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News