: బాలీవుడ్ నటి పూజా మిశ్రాను బహిష్కరించిన ముంబై ఆపార్ట్ మెంట్ సొసైటీ


బాలీవుడ్ నటి పూజా మిశ్రా తమ ఇళ్ల పక్కనే ఉండటం 'న్యూసెన్స్'గా ఉందని ఆరోపిస్తూ, లోఖండ్ వాలా ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ సొసైటీ సభ్యులు ఆమెను బహిష్కరించారు. ఈ ప్రాంతంలోని విండ్ సార్ టవర్ లో పూజా మిశ్రా కుటుంబం నివసిస్తుండగా, వారితో పాటు పూజా ఉండేందుకు వీలు లేదని వీరు తీర్మానించారు. ఆమె ప్రవర్తన సక్రమంగా ఉండదని, ఇరుగు పొరుగు వారితో గొడవలు పడుతుందని, తన కెరీర్ ఎదగనీయకుండా క్షుద్రపూజలు చేయించారని కొందరితో వాదనలకు దిగిందని కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ అపార్ట్ మెంట్ లోని 401లో పూజా తల్లిదండ్రులు ఉండగా, తమ కుమార్తె తమతో ఉండబోదని గత సంవత్సరంలో వారి నుంచి లిఖిత పూర్వక హామీని కమిటీ తీసుకున్నట్టు తెలుస్తోంది. తనపై నిషేధం విధించిన కమిటీని కోర్టుకు లాగుతానని ఇప్పుడు పూజా హెచ్చరిస్తోంది. తన ఇంట్లోకి రాకుండా తననే నిషేధించడానికి వారెవరని ప్రశ్నించిన పూజ, తానే ఓ న్యాయవాదినని, తన తరఫున కోర్టులో తానే వాదించుకుంటానని చెబుతోంది. కాగా, కొన్ని అపార్ట్ మెంట్ కమిటీలకు ఇటువంటి హక్కులు ఉంటాయని, అయితే, సరైన సాక్ష్యాలు, కారణాలు చూపకుండా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వాటిని సవాల్ చేయవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News