: మీడియాను చూసి కర్ణాటక సీఎస్ పరుగో పరుగు
మీడియాను చూసి కర్ణాటక చీఫ్ సెక్రటరీ పరుగందుకోవడం అక్కడ కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... కర్ణాటకలో ఎంపీలకు కేటాయించిన నిధులపై ఆ రాష్ట్ర సచివాలయంలో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబి దురై అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కర్ణాటక సీఎస్ అరవింద్ జాదవ్ 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. అలా వచ్చారో లేదో మీడియాను చూసి పరుగందుకున్నారు. మూడవ ఫ్లోర్ లో ఉన్న తన కార్యాలయంలోకి వెళ్లేంతవరకు పరుగు ఆపని ఆయన, తన కార్యాలయానికి చేరుకుని లోపలి గడియపెట్టుకున్నారు. సీఎస్ ఎందుకలా పరుగుతీశారని ఆరాతీసిన మీడియాకు...ఆలస్యంగా రావడంపై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని భయపడి పారిపోయారని తెలిసింది.