: విశాఖ-చెన్నై కారిడార్ కు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆర్థిక సాయం


విశాఖ-చెన్నై కారిడార్ (వీసీఐసీ) నిర్మాణంలో ఏపీ ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ముందుకొచ్చింది. ఏపీలో దాని ఏర్పాటుకు ఏడీబీ తరపున 840 మిలియన్ డాలర్ల ఆర్థికసాయం అందిస్తామని డైరెక్టర్ తెరేసోఖో ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన 'సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్- విజన్ 2029' అంశంపై జరిగిన చర్చలో ఏడీబీ డైరెక్టర్ తెరేసోఖో పాల్గొని మాట్లాడారు. వీసీఐసీ పరిధిలో విశాఖ-కాకినాడ పారిశ్రామిక నోడ్స్, కంకిపాడు-గన్నవరం - ఏర్పేడు - శ్రీకాళహస్తి పారిశ్రామిక నోడ్స్ ఉంటాయని ఈ సందర్భంగా వెల్లడించారు.

  • Loading...

More Telugu News