: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం: నారా భువనేశ్వరి
ఈ నెల 18న తన తండ్రి, దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా లెజండరీ బ్లెడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంపును నిర్వహిస్తున్నట్టు నారా భువనేశ్వరి తెలిపారు. ఈ రక్తదానంలో అందరూ పాల్గొనాలని ఆమె కోరారు. రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ, తెలుగు జాతికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆ మహానుభావుడికి కూతురుగా పుట్టడం తన అదృష్టమని చెప్పారు.