: భారతదేశం... ఒక అసహన దేశం... తస్లీమా నస్రీన్
భారతదేశం... ఒక అసహన దేశమని, ఇక్కడ కొంతమంది అసహనవాదులు తిష్టవేసుకుని ఉన్నారని బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు హిందూ ఛాందసవాదాన్ని, ముస్లిం విధానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ లో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఉదంతాన్ని గుర్తుచేస్తూ, ప్రతి సమాజంలోనూ కొంతమంది అసహనవాదులు ఉంటారని, అయితే వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని అన్నారు.