: తొలి వన్డే నెగ్గితే చాలు...భారత్ ను కోలుకోకుండా చేయొచ్చు: ఆరోన్ ఫించ్
జనవరి 12న పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో విజయం సాధిస్తే సిరీస్ లో భారత్ ను సులువుగా ఓడించొచ్చని ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. ఆరంభంలో దూకుడుగా ఆడడం ద్వారా భారత్ ను కోలుకోనీయకుండా చేయవచ్చని ఫించ్ అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో విజయం సాధిస్తే సగం సిరీస్ గెలిచేసినట్టేనని ఫించ్ అభిప్రాయపడ్డాడు. ఒక్కసారి ఆత్మవిశ్వాసాన్ని పోగొడితే తిరిగి భారత్ కోలుకోవడం కష్టమని, అందుకే దూకుడు మంత్రంతో భారత్ ను మట్టికరిపిస్తామని ఫించ్ చెప్పాడు. టీమిండియా టాపార్డర్ బలంగా కనిపిస్తున్నప్పటికీ పెర్త్ బౌన్సీపిచ్ ఆసీస్ కే లాభిస్తుందని ఫించ్ పేర్కొన్నాడు. ప్రస్తుత సిరీస్ లో తామే ఫేవరేట్ అని తెలిపాడు.