: ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెడితే వనరుల కోసం వెతుక్కోక్కర్లేదు!: నిర్మలా సీతారామన్
దేశంలో ఎక్కడ, ఏ రంగంలో చూసినా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు ఉన్నారని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. విశాఖపట్టణంలో ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేనికి ప్రసిద్ధి? అని పారిశ్రామిక వేత్తలు అడిగితే ఇంజనీర్లు, వైద్యులు, విద్యావంతులని అంతా చెబుతారని అన్నారు. అపారమైన వనరులకు ఆంధ్రప్రదేశ్ పుట్టిల్లని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఏ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపట్టినా అందులో ఆంధ్రప్రదేశ్ వాసుల భాగస్వామ్యముంటుందని ఆమె వెల్లడించారు. అదే ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెడితే వనరుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదని ఆమె తెలిపారు. పరిశ్రమలు పెడితే ప్రభుత్వం చేయూతనిస్తుందని ఆమె అన్నారు.