: బెజవాడకు వస్తున్న రాజ్ నాథ్...వెంకయ్య ‘ట్రస్ట్’ ప్రారంభోత్సవంలో ఎస్పీ బాలుకు సన్మానం
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు విజయవాడలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూతురు ఆధ్వర్యంలోని స్వర్ణ భారతి ట్రస్ట్ కు చెందిన నూతన శాఖను ఆయన విజయవాడ సమీపంలోని ఆత్కూరులో ప్రారంభించనున్నారు. నేటి మద్యాహ్నం 12.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న రాజ్ నాథ్ అక్కడి నుంచి నేరుగా ఆత్కూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు ట్రస్ట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఆయన ఆ తర్వాత జరగనున్న కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ట్రస్ట్ ఘనంగా సన్మానించనుంది. ట్రస్ట్ సన్మానాన్ని ఎస్పీ బాలు, రాజ్ నాథ్ చేతుల మీదుగా స్వీకరిస్తారు.