: మా కష్టం సినిమా పూర్తయిన తర్వాతే మొదలవుతుంది: నిర్మాత దిల్ రాజు


తమ కష్టం సినిమా పూర్తయిన తర్వాతే మొదలవుతుందని.. ఈ చిత్రానికి కూడా అలాగే పడుతున్నామని నిర్మాత దిల్ రాజు అన్నారు. కృష్ణాష్టమి చిత్రం ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, సినిమా కోసం ఎంతైనా కష్టపడతామని, దానిని సక్సెస్ చేయాలన్న వీక్ నెస్ తమకు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో సునీల్ బాగా కష్టపడ్డాడని అన్నారు. తమ బ్యానర్ నుంచి మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు ఇస్తున్నానన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఈ చిత్రం విడుదలవుతుందని దిల్ రాజ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News