: తనలోని మైనస్ పాయింట్ల గురించి సునీల్ పదేపదే అడిగేవాడు: దర్శకుడు వాసువర్మ
తనలోని మైనస్ పాయింట్లు ఏంటో చెప్పమని హీరో సునీల్ తనను పదేపదే అడిగేవాడని కృష్ణాష్టమి చిత్రం దర్శకుడు వాసువర్మ అన్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘నాలో మైనస్ లు ఏంటో చెప్పండి? అని సునీల్ నన్ను అడుగుతుండేవాడు. సునీల్లో మైనస్ ఏమిటంటే... అతడు పదేపదే నాలో మైనస్ ఏంటీ? అని అడగటమే అతనిలో మైనస్. అంతకు మించి ఏమీ లేవు’ అని వాసు వర్మ పేర్కొన్నారు.