: ఆ పత్రాల్లో..నేతాజీ విమానం కూలిన నాటి వివరాలు!


నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మృతి చెందిన రోజు గురించిన వివరాలపై మరింత సమాచారం అందింది. దీనికి సంబంధించిన వివరాలను బోస్ ఫైల్స్.ఇన్ఫో అనే వెబ్ సైట్ ప్రచురించింది. ఆగస్టు 18,1945 లో నేతాజీ తైవాన్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయనతో పాటు జపనీస్ ఆర్మీ లెఫ్ట్ నెంట్ జనరల్ సునమస షెదీ, మరో 13 మంది ఉన్నట్లు ఆ వెబ్ సైట్ లో పొందుపరిచిన పత్రాల్లో బ్రిటన్ పేర్కొంది. కాగా, నేతాజీ మృతిపై భారత సర్కార్ షానవాజ్ కమిటీని నియమించింది. నేతాజీ ప్రయాణించిన విమానానికి క్లియరెన్స్ ఇచ్చిన జపనీస్ ఎయిర్ స్టాఫ్ అధికారి మేజర్ టొరకోనో ఈ కమిటీకి వెల్లడించిన వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News