: ‘నాన్నకు ప్రేమతో’ పోస్టర్లపై నిరసన... జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు!


సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం పోస్టర్లపై హైదరాబాదులో ముస్లిం యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఇవి ఉన్నాయని, ఈ పోస్టర్లను తక్షణం తొలగించాలని, ఆ సన్నివేశాలను ఆ చిత్రం నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. రోడామిస్త్రీ కాలనీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ కాలనీలో ముస్లిం యువత ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాసబ్ ట్యాంకులోని సెన్సార్ బోర్డ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

  • Loading...

More Telugu News