: ‘బ్రిస్బేన్’ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత అజరెంకా!


బ్రిస్బేన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా విక్టోరియా అజరెంకా నిలిచింది. శనివారం జరిగిన తుదిపోరులో జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ ను ఈ మాజీ ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి మట్టికరిపించింది. 6-3, 6-1తో వరుస సెట్లను అజరెంకా సాధించింది. సుమారు గంటా పదిహేను నిమిషాల పాటు వారిద్దరూ తలపడ్డారు. కాగా, త్వరలో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ లో అజరెంకా పాల్గొననుంది. కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించిన అజరెంకా, అగ్రశ్రేణి క్రీడాకారిణులకు సవాల్ గా మారే అవకాశాలు లేకపోలేదని క్రీడాపండితులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News