: తెలుగు రాష్ట్రాలలో 'లావా' మొబైల్స్ అదృష్టరేఖ ఆఫర్
ప్రముఖ మొబైల్, టాబ్లెట్ ల తయారీ సంస్థ 'లావా ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి సంక్రాంతి పండుగ ఆఫర్ ప్రకటించింది. తమ మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ లు కొనుగోలు చేసేవారికి అదృష్టరేఖ ఆఫర్ బహుమతులు ఇవ్వనుంది. ఏపీలోని 1,700 విక్రయశాలలు, తెలంగాణలోని 1,500 విక్రయశాలల్లో ఈ నెల 31 వరకు లావా స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ కొన్నవారికి తప్పనిసరిగా బహుమతి అందజేయనుంది. ఈ స్కీములో 'జాక్ పాట్ గిఫ్ట్, మీ బహుమతి ఎంచుకోండి, మీ విహార యాత్ర స్థలాన్ని ఎంచుకోండి' పేరుతో 3 రకాల కార్డులు ఉన్నాయి. ఫోన్ లేదా టాబ్లెట్ కొన్నవారికి స్క్రాచ్ కార్డు ఇస్తారు. అందులో జాక్ పాట్ కార్డుల్లో ఒకటి ఎంచుకోవాలి. వీటిలో గిఫ్ట్, విహారయాత్ర స్థలం కార్డులు వస్తే కనుక వాటిల్లోంచి తమకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవలసి వుంటుంది. విహారయాత్ర కార్డు గెలుచుకున్న వారు జూన్ 30 లోపు తమ ప్లేస్ ను ఎంచుకుని ఈ ఏడాది ఆగస్టు 14లోపు యాత్రను పూర్తి చేయాల్సి ఉంటుంది.