: ఢిల్లీలో ఈ 15 తరువాత కూడా సరి, బేసి వాహన ఫార్ములా కొనసాగుతుంది
దేశ రాజధాని ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆప్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరి, బేసి వాహన ఫార్ములాను జనవరి 15 తరువాత కూడా కొనసాగించవచ్చని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ విధానాన్ని నిలిపివేయాలంటూ ఇటీవల అందిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. సరి, బేసి ఫార్ములాను సమర్థవంతంగా అమలు చేసేందుకు 15 రోజులు సరిపోవని, అవసరమైతే దాని తరువాత కూడా కొనసాగించవచ్చని సూచించింది. ఢిల్లీ సర్కారు చేపడుతున్న ఈ విధానంపై ఢిల్లీ హైకోర్టు తీర్పు వచ్చేంత వరకూ ఈ సరి, బేసి వాహన ఫార్ములా కొనసాగనుంది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం సరి, బేసి నెంబర్ల ఆధారంగా వాహనాలు రోడ్లపై తిరుగాడేందుకు ఆప్ సర్కారు ఈ నూతన విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది.