: బీసీలను మర్చిపోతే నన్ను నేను మర్చిపోయినట్లే: చంద్రబాబు
బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీని వెన్నంటే ఉన్నారని..వాళ్లను మర్చిపోతే తనను తానే మర్చిపోయినట్లని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఈరోజు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాబు మాట్లాడుతూ, కాపు కులస్థులను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొన్ని రాజకీయ పార్టీలు కాపులపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాయని అన్నారు. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. భూగర్భ జలాలు నిల్వ కోసం పాటించాల్సిన పద్ధతులను, కరవు పరిస్థితుల నుంచి బయటపడేందుకు తమ సర్కార్ తీసుకుంటున్న చర్యల గురించి బాబు ప్రస్తావించారు.