: సంప్రదాయానికి భిన్నంగా ఒబామా చివరి ప్రసంగం?
అమెరికా దేశాధినేత ఒబామా శకం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి చివరి ప్రసంగం ఇచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ ప్రసంగంలో సంప్రదాయానుగుణంగా నూతన సంవత్సరం అమెరికాలో తీసుకురాబోయే కొత్త చట్టాలు, ప్రభుత్వ విధానాలను ఈ ప్రసంగం (స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రెస్) లో వివరించాలి. ఇందుకు విరుద్ధంగా అమెరికాను మరింత శక్తిమంతంగా మార్చేందుకు ఏం చేయాలి? భావి అమెరికన్ల (చిన్నారుల) భవిష్యత్ ను ఎలా తీర్చిదిద్దాలి? అందుకోసం ఏ చర్యలు తీసుకోవాలి? అన్న అంశాలపై ఆయన ప్రసంగం సాగుతుంది.