: ఏలూరులో రౌడీషీటర్ పై కత్తులతో దాడి!


పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రౌడీషీటర్ చిన్నికృష్ణపై దుండగులు కత్తులతో దాడి చేసిన సంఘటన ఈ రోజు జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నికృష్ణను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, దాడి అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News