: విజయవాడలో ఈ నెల 17న ఆనం సోదరుల బహిరంగ సభ... టీడీపీలో చేరనున్న ఆనం కేడర్


ఈ నెల 17న విజయవాడలోని 'ఏ' కన్వెన్షన్ సెంటర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. ఆ రోజు సీఎం చంద్రబాబు సమక్షంలో తమ కేడరంతా టీడీపీలో చేరుతుందని చెప్పారు. ఈ మేరకు నెల్లూరులోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనం మాట్లాడారు. ఇప్పటివరకు తమతో పాటు నడిచిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులంతా టీడీపీలో చేరతారని, నగరం, రూరల్ తో పాటు జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో తమ అభిమానులు ఉన్నారని చెప్పారు. కొన్ని కారణాల వల్ల గతంలో ఇతర పార్టీలలోకి వెళ్లిన వారు తిరిగి తమతో కలిసి టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, జిల్లా మంత్రి తదితరులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. జిల్లా నుంచి ఈ సభకు నేతలు, కార్యకర్తలు, అభిమానులను తరలించేందుకు ప్రత్యేక రైలు, బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News