: దేశాభివృద్ధిలో బిల్డర్లూ భాగస్వాములే: వెంకయ్యనాయుడు


దేశాభివృద్ధిలో బిల్డర్లూ భాగస్వాములేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 27వ అఖిల భారత నిర్మాణ దారుల సమాఖ్య (ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్) సదస్సు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈరోజు ప్రారంభమైంది. గౌరవ అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు ఈ సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి ఉజ్వల భవిష్యత్ ఉందని.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్ కలలు సాకారమయ్యేందుకు అందరూ కలిసిరావాలని కోరారు. నిర్మాణదారుల బృందాన్ని ప్రధాని నరేంద్రమోదీ వద్దకు తీసుకెళ్తానని.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో 10 వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెంకయ్యనాయుడు వెల్లడించారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, నిర్మాణ రంగం అభివృద్ధి చెందడానికి తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నిర్మాణ రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారుతోందని కేసీఆర్ అన్నారు. ఈ సదస్సులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నంబర్ వన్ కాంట్రాక్టర్లు, టర్కీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News